పాకిస్థాన్‌పై భారత్ విజయం సాధించింది. భారత్ కేవలం నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి 42.3 ఓవర్లలో ఊదిపడేసింది. ఈ మ్యాచ్‌లో విరాట్, శ్రేయస్ ఇద్దరూ నిలకడగా ఆడారు. భారత బ్యాటర్లలో విరాట్ కోహ్లీ సెంచరీ పూర్తి చేశాడు. శ్రేయస్ ఆఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ పాకిస్థాన్‌ను 241 పరుగులకే పరిమితం చేసింది. దీని తర్వాత టీమ్ ఇండియా బరిలోకి దిగింది. ఓపెనర్లుగా రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ వచ్చారు. షహీన్ షా అఫ్రిది తొలి ఓవర్‌ వేశాడు. కాగా, కెప్టెన్ రోహిత్ శర్మ (20; 15 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) ఔటయ్యాడు. షహీన్ షా ఆఫ్రిది వేసిన ఐదో ఓవర్ ఐదో బంతికి ఫోర్ కొట్టిన రోహిత్ ఆఖరి బంతికి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అనంతరం శుభ్‌మన్ గిల్ దూకుడుగా ఆడాడు.

విరాట్ కోహ్లీ క్రీజ్‌లోకి వచ్చాడు. ఆ సమయంలో విరాట్ కోహ్లీ కూడా తన వన్డే కెరీర్‌లో 14 వేల పరుగులు కూడా పూర్తి చేశాడు. అబ్రార్ అహ్మద్ వేసిన 17.3 ఓవర్లో శుభమ్ గిల్ (46) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 100 పరుగుల వద్ద భారత్ రెండో వికెట్ కోల్పోయింది. గిల్ పెవిలియన్ చేరడంతో శ్రేయాస్ అయ్యర్ బరిలోకి దిగాడు. శ్రేయాస్ అయ్యర్ మరియు విరాట్ కోహ్లీ ఇద్దరూ చాకచక్యంగా ముందుకు సాగారు. విరాట్ కోహ్లీ 62 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. అబ్రార్ అహ్మద్ వేసిన 37 ఓవర్ల ఐదో బంతికి శ్రేయాస్ అయ్యర్ సింగిల్ తీసి అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. ఖుల్దీష్ షా వేసిన 38.5 ఓవర్లలో శ్రేయాస్ అయ్యర్ (56) ఔటయ్యాడు. ఇమామ్ ఉల్‌ హక్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. అనంతరం బరిలోకి దిగిన హార్దిక్ పాండ్యా కేవలం ఎనిమిది పరుగులు మాత్రమే చేశాడు. షహీన్ షా అఫ్రిది వేసిన 40 ఓవర్‌లో చివరి బంతికి హార్దిక్ పాండ్య (8) రిజ్వాన్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. షహీన్ షా వేసిన 42 ఓవర్‌లో 13 పరుగులు వచ్చాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *