జమిలి ఎన్నికల కోసం ఏర్పడిన జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జెపిసి) పదవీకాలాన్ని పొడిగించడానికి లోక్‌సభ అంగీకరించింది. జమిలి ఎన్నికల కోసం లోక్‌సభలో ప్రవేశపెట్టిన రాజ్యాంగ సవరణ బిల్లుపై అధ్యయనం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం జేపీసీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇటీవల, బీజేపీ ఎంపీ పీపీ చౌదరి ప్రతిపాదించిన గడువు పొడిగింపు తీర్మానాన్ని సభ ఆమోదించింది. రాబోయే వర్షాకాల సమావేశాల చివరి వారం మొదటి రోజు వరకు గడువును పొడిగించారు.
39 మంది ఎంపీలతో ఏర్పాటు చేయబడిన జేపీసీ కమిటీ ఈ బిల్లును అధ్యయనం చేస్తోంది. ఇందులో లోక్‌సభ నుండి 27 మంది సభ్యులు మరియు రాజ్యసభ నుండి 12 మంది సభ్యులు ఉన్నారు. నిజానికి, ఈ కమిటీ పదవీకాలం ఏప్రిల్ 4తో ముగియనుంది. బిల్లుపై మరిన్ని పనులు చేయాల్సి ఉందని అధికారిక వర్గాలు వెల్లడించిన తర్వాత, జేపీసీ గడువును పొడిగించాలని లోక్‌సభ ఈరోజు ఒక తీర్మానాన్ని ఆమోదించింది.