హైదరాబాద్: రాజేంద్రనగర్‌లోని అత్తాపూర్‌లో శనివారం తన ఇంటిపై గాలిపటం ఎగురవేస్తుండగా లైవ్ వైర్ తగిలి 11 ఏళ్ల బాలుడు తనిష్క్ విద్యుదాఘాతానికి గురయ్యాడు. ఈ ఘటనతో తనిష్క్ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. సంక్రాంతికి పాఠశాలలకు సెలవులు ప్రకటించడంతో తనిష్క్ గాలిపటం ఎగురవేసేందుకు ఇంటి నుంచి బయటకు వెళ్లగా, లైవ్‌వైర్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా, జనవరి 13 నుంచి 15 వరకు సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.