ఓ యువతిని దారుణంగా హతమార్చారు దుండగులు..! మరోచోట డెడ్ బాడీని పెట్రోల్ పోసి తగలబెట్టారు..! అది కూడా మిట్ట మధ్యాహ్నం. హత్య జరిగి 24 గంటలు దాటుతున్నా.. మిస్టరీ వీడటం లేదు. మొయినాబాద్ పరిధిలో పోలీసులకే సవాల్‌గా మారిందీ ఘటన. హంతకులు తెలివిగా వ్యవహరించడంతో.. సీసీ కెమెరాలు, టెక్నికల్ ఎవిడెన్స్, స్నిఫర్ డాగ్స్, ప్రత్యేక బృందాలతో పోలీసులు అణువణువూ జల్లెడ పడుతున్నారు.
హైదరాబాద్: ఓ యువతిని దారుణంగా హతమార్చారు దుండగులు..! మరోచోట డెడ్ బాడీని పెట్రోల్ పోసి తగలబెట్టారు..! అది కూడా మిట్ట మధ్యాహ్నం. హత్య జరిగి 24 గంటలు దాటుతున్నా.. మిస్టరీ వీడటం లేదు. మొయినాబాద్ పరిధిలో పోలీసులకే సవాల్‌గా మారిందీ ఘటన. హంతకులు తెలివిగా వ్యవహరించడంతో.. సీసీ కెమెరాలు, టెక్నికల్ ఎవిడెన్స్, స్నిఫర్ డాగ్స్, ప్రత్యేక బృందాలతో పోలీసులు అణువణువూ జల్లెడ పడుతున్నారు. మొయినాబాద్ శివారులోని బాకారంలో ఓ యువతి హత్య సంచలనం రేపింది. మిట్ట మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఓ పొలం సమీపంలో ముళ్ళ పొదల మధ్యలో మంటలు రావడం గమనించారు స్థానిక రైతులు. ఎవరో.. చెత్త చెదారం తగలబెడుతున్నారు అనుకున్నారు. కానీ మంటలు మరింత ఎక్కువ అవడంతో అనుమానం వచ్చిన రైతులు దగ్గరి వరకు వెళ్ళి చూసారు. అక్కడ ఒక యువతి శవం తగలబడుతూ ఉండటం గమనించి, పోలీసులకు సమాచారం ఇచ్చారు. భయాందోళనకు గురైన రైతులు.. మంటలను ఆర్పే ప్రయత్నం చేయలేదు. పోలీసులు వచ్చే వరకు బాడీ తగలబడుతూనే ఉంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మంటలను ఆర్పారు. అప్పటికే మృతదేహం 90 శాతం కాలిపోయింది