హైదరాబాద్: ఇక్కడి జూబ్లీహిల్స్‌లో మంగళవారం ఓ జూనియర్ ఆర్టిస్ట్‌పై ఆమె స్నేహితుడు దాడి చేసాడు. టెలివిజన్ సీరియల్స్‌లో నటించిన ఆ మహిళ గత ఆరేళ్లుగా ఆ వ్యక్తితో స్నేహం కొనసాగిస్తోంది.
అయితే కొన్ని విషయాలపై వారి మధ్య విభేదాలు రావడంతో ఆ వ్యక్తి జూబ్లీహిల్స్‌లోని గణేష్ కాంప్లెక్స్‌కు వచ్చి చర్చించాడు. వీరి మధ్య వాగ్వాదం జరగడంతో సదరు వ్యక్తి మహిళను కొట్టాడు. మహిళ ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.