టీమిండియా యువ క్రికెటర్ తిలక్ వర్మ తన ప్రతిభతో మరో సంచలనం నెలకొల్పాడు. టీ20 క్రికెట్‌లో వరుసగా మూడు ఇన్నింగ్స్‌ల్లో శతకాలు నమోదు చేసి, ఈ ఫీట్ సాధించిన తొలి భారతీయ క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో భాగంగా ఈరోజు రాజ్‌కోట్‌లో మేఘాలయతో జరిగిన మ్యాచ్‌లో తిలక్ తనదైన ప్రదర్శనతో విజృంభించాడు.
హైదరాబాద్ జట్టు కెప్టెన్‌గా, ఓపెనర్‌గా బరిలోకి దిగిన తిలక్ వర్మ కేవలం 67 బంతుల్లోనే 151 పరుగులు సాధించాడు. ఈ ఇన్నింగ్స్‌లో 14 బౌండరీలు, 10 సిక్సర్లతో , అతని స్ట్రైక్ రేట్ 225.6గా నమోదైంది. ఈ ప్రదర్శనలో తిలక్ కేవలం 18 బంతుల్లో ఆరు ఫోర్లు, మూడు సిక్సర్లతో హాఫ్ సెంచరీ పూర్తి చేసాడు. తన ప్రతిభతో టీ20 క్రికెట్‌లో కొత్త చరిత్ర లిఖించిన తిలక్, భవిష్యత్తులో భారత జట్టు విజయాలలో కీలక పాత్ర పోషించగలడనే ఆశాభావం అందరిలో వ్యక్తమవుతోంది.