భారత్ , శ్రీలంక టీ20 సిరీస్‌కు సమయం ఆసన్నం అయింది. నేడు రాత్రి 7 గంటలకు ఇరు మ్యాచ్లు పల్లెకెలె అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో తలపడనున్నాయి. శ్రీలంక పర్యటనలో భారత్ మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. ఈ టీ20 సిరీస్ కి సూర్య కుమార్ యాదవ్ నాయకత్వం వహిస్తున్నాడు. భారత్ నూతన హెడ్ కోచ్ అయినా గౌతమ్ గంభీర్ కి తోలి మ్యాచ్ కావడం ఎంతో ఉత్కంఠ నెలకొంది. గౌతమ్ గంభీర్ తన ప్రయోగాలు మొదలుపెట్టారు. హార్దిక్ పాండ్య అంటే విధ్వంసకర బ్యాటింగ్, ఫాస్ట్ బౌలింగ్ మనకు గుర్తుకు వస్తుంది. తోలి టీ20 మ్యాచ్ కి ముందు ఆటగాళ్లు అందరు మైదానంలో ప్రాక్టీస్ చేస్తూ కనిపించారు.
తాజాగా ఈ సందర్భంలో హార్దిక్ నెట్ ప్రాక్టీస్‌లో లెగ్ స్పిన్నర్ గా అవతారమెత్తాడు. ఆది కూడా భారత స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే బౌలింగ్ శైలిని అనుకరిస్తూ బౌలింగ్ చేశాడు. సంబంధించిన ఆసక్తికరమైన ఫొటోలు ప్రస్తుతం సాంఘిక ప్రసార మాధ్యమంలో వైరల్ గా మారాయి. ఈ దృశాలను చూసిన క్రికెట్ ఫ్యాన్స్ గౌతమ్ గంభీర్ తన ప్రయోగాలు మొదలు పెట్టాడంటూ కామెంట్ చేస్తున్నారు. దూకుడు స్వభావాన్ని ప్రదర్శించే గౌతమ్ గంభీర్ జట్టుని ఏ విధంగా నడిపించబోతున్నారని క్రికెట్ వర్గాలలో ఎంతగానో ఆసక్తి నెలకొంది.