పారిస్ ఒలింపిక్స్‌లో సెమీఫైనల్‌కు చేరిన భారత హాకీ జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. జర్మనీతో మంగళవారం జరగనున్న సెమీస్‌కు కీలక ఆటగాడు మరియు డిఫెండర్ అమిత్ రోహిదాస్ అందుబాటులో ఉండడం లేదు. బ్రిటన్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్‌లో ప్రత్యర్థి ఆటగాడికి స్టిక్ తగిలించాడన్న కారణంతో ఒలింపిక్ కమిటీ అమిత్‌పై వేటు వేసింది. ఒక మ్యాచ్ నిషేధం విధించింది.

బ్రిటన్ తో జరిగిన మ్యాచ్ లో అమిత్ రెడ్ కార్డ్ అందుకుని బయటకు వెళ్లాడు. కానీ భారత జట్టు కేవలం 10 మందితో ప్రత్యర్థిపై విజయం సాధించింది. అమిత్‌ను ఒలింపిక్ కమిటీ తిరస్కరించడంపై భారత హాకీ సంఘం తీవ్రంగా స్పందించింది. ఇలాంటి ఘటనల వల్ల క్రీడాకారుల్లో ఆత్మవిశ్వాసం సన్నగిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. క్రీడా సమగ్రతను కాపాడేందుకు భవిష్యత్తులో జరగబోయే మ్యాచ్‌లనైనా సరిగ్గా జరిగేలా మున్ముందు సమీక్షించాలని హాకీ ఇండియా కోరింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *