భారత యువ గ్రాండ్ మాస్టర్ దొమ్మరాజు గుకేశ్ ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్‌లో చారిత్రాత్మక విజయం సాధించిన విషయం తెలిసిందే. చెన్నైకు చెందిన డింగ్ లిరెన్‌ను ఓడించి గుకేశ్ ప్రపంచ ఛాంపియన్ గా అవతరించాడు. 18 ఏళ్లకే ఇలా వరల్డ్ చెస్ ఛాంపియన్‌గా నిలిచాడు. తద్వారా ఈ ప్రతిష్ఠాత్మక టైటిల్‌ను గెలుచుకున్న అతి పిన్న వయస్కుడైన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.
అయితే, వరల్డ్ చెస్ ఛాంపియన్‌గా నిలిచిన గుకేశ్‌కు ఎంత ప్రైజ్ మనీ దక్కుతుందనేది చాలా మంది మదిలో మెదిలే ప్రశ్న. కాగా, గుకేశ్‌కు ట్రోఫీతో పాటు 1.35 మిలియన్ డాలర్ల ప్రైజ్‌మనీ అందుతుంది. అలాగే రన్నరప్ డింగ్‌కు 1.15 మిలియన్ డాలర్లు (రూ. 9.75కోట్లు) దక్కనుంది.