హైదరాబాద్‌, ఆట ప్రతినిధి: జాతీయ స్కూల్‌ గేమ్స్‌ స్విమ్మింగ్‌ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ యువ స్విమ్మర్‌ సుహాస్‌ ప్రీతమ్‌ మూడు పతకాలతో సత్తాచాటాడు. ఢిల్లీలోని శ్యామ్‌ ప్రసాద్‌ ముఖర్జీ స్విమ్మింగ్‌ పూల్‌ కాంప్లెక్స్‌లో జరిగిన ఈ పోటీల్లో సుహాస్‌ ఒక స్వర్ణం, 2 రజతాలు కైవసం చేసుకున్నాడు. ఆదివారం జరిగిన అండర్‌-17 బాలుర 50 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌లో సుహాస్‌ 27.32 సెకన్లలో లక్ష్యాన్ని చేరి అగ్రస్థానంలో నిలిచాడు. తెలంగాణకు చెందిన వర్షిత్‌ 200 మీటర్ల మెడ్లేలో రజతం గెలుచుకున్నాడు.

By Prabhu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *