షకీబ్ అల్ హసన్ : బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబుల్ హస’న్(షకీబ్ అల్ హసన్) ఎంపీగా కొత్త అవతారం ఎత్తనున్నాడు. ఇన్నాళ్లు మైదానంలో ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన షకీబ్ ప్రజాజీవితంలో భాగం కానున్నాడు. వండే వరల్డ్ కప్ అనంతరం రాజకీయాల్లో అడుగుపెట్టిన అతడు.. తొలిసారే సార్వత్రిక ఎన్నికల్లో(సాధారణ ఎన్నికలు) ఘన విజయం సాధించాడు. ఆదివారం జరిగిన ఎన్నికల్లో మగుర 1(మగుర 1) నియోజకవర్గం నుంచి పోటీ చేసిన షకీబ్ భారీ మెజార్టీతో గెలుపొందాడు.
ప్రధాని షేక్ హసీనా(షేక్ హసీనా)కు చెందిన అవామీ లీగ్(అవామీ లీగ్) తరఫున పోటీ చేసిన ఈ ఆల్‌రౌండర్ ఏకంగా లక్షా యాభై వేల మెజార్టీతో సమీప ప్రత్యర్థి రెజౌల్ హసన్(రెజాల్ హసన్)ను చిత్తు చేశాడు. షకీబ్‌కు 1,85,388 ఓట్లు రాగా.. బంగ్లాదేశ్ కాంగ్రెస్ పార్టీకి చెందిన హసన్‌కు కేవలం 45,933 ఓట్లు పడ్డాయి. దాంతో, ఎన్నికల్లో గెలిచిన బంగ్లాదేశ్ రెండో కెప్టెన్‌గా ఎంపీగా షకీబ్ రికార్డు సృష్టించాడు. ఇంతకు ముందు ముష్రఫే ముర్తాజా(ముషర్ఫే మోర్తాజా) ఎంపీగా ఎన్నికైన విషం తెలుసు.
షకీబ్ ఎన్నికల్లో బరిలోకి దిగుతున్నానని ప్రకటించగానే అతడి క్రికెట్ కెరీర్ ముగిసిందని కొందరు ప్రచారం మొదలెట్టారు. దాంతో, వాళ్లకు చెక్ పెట్టేందుకు అతడు ప్రచార సభల్లో జనాన్ని అడిగాడు. ‘నేను రిటైర్ అవ్వాలా? ‘అని ఎన్నికల ప్రచారంలో ఓటర్లను అడిగిన షకీబ్.. ‘నేను ఇంకా క్రికెట్‌కు వీడ్కోలు పలకలేదు. అలాంటప్పుడు ఈ వదంతులు ఎందుకు సృష్టిస్తున్నారు’ అంటూ ప్రత్యర్థులపై విరుచుకుపడ్డాడు.19 ఏండ్ల’కే ప్రీమియర్ స్పోర్ట్స్ అకాడమీలో చేరిన షకీబ్ 2006లో బ్యాటింగ్ ఆల్రౌండర్‌గా అరంగేట్రం చేశాడు. అనతికాలంలోనే ప్ర పంచంలోని ఉత్తమ ఆల్‌రౌండర్లలో ఒకడిగా ఎదిగాడు. అంతేకాదు మూడు ఫార్మాట్లలో అగ్రస్థానంలో నిలిచిన తొలి ఆల్‌రౌండర్‌గా షకీబ్ గుర్తింపు సాధించాడు.