కామారెడ్డి, జనవరి 7: జాతీయ స్కూల్ గేమ్స్ అండర్-17 కబడ్డీ పోటీల్లో తెలంగాణ శుభారంభం చేసింది. కామారెడ్డి జిల్లా ఆదివారం రాత్రి అట్టహాసంగా ఆప్రారంభమైన పోటీల తొలి పోరులో తెలంగాణ 8 పాయింట్ల తేడాతో పశ్చిమబెంగాల్‌పై విజయం సాధించింది. ఇతర మ్యాచ్‌ల్లో జార్ఖండ్‌పై కేరళ, జమ్ముకశ్మీర్‌పై హిమాచల్ ప్రదేశ్, కేంద్రీయ విద్యాలయపై తమిళనాడు గెలుపొందాయి.
అంతకుముందు కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి, కలెక్టర్ జితేశ్ పాటిల్ పోటీలను ప్రారంభించారు. ఈ టోర్నీలో 29 రాష్ర్టాలకు చెందిన సుమారు 450 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు. పోటీల ప్రారంభోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. క్రీడాకారులు గెలుపోటములను సమానంగా స్వీకరించాలని.. చిన్నప్పటి నుంచే క్రీడాస్ఫూర్తిని అలవరుచుకోవాలని అన్నారు. కామారెడ్డిలో తొలిసారి జాతీయ స్థాయి పోటీలు జరగడం ఆనందంగా ఉందన్నారు.