ఏపీ ప్రజలకు కూటమి ప్రభుత్వం శుభవార్త తెలిపింది. నేడు ఆంధ్రప్రదేశ్ లో మరో 75 అన్నా క్యాంటిన్లు ప్రారంభం కానున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు సచివాలయంలో అన్నా క్యాంటిన్ ను ప్రారంభించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ప్రభుత్వం 203 అన్నా క్యాంటిన్లను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే వంద అన్నా క్యాంటిన్లను ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది.
రూ.15కే మూడు పూటలా ప్రభుత్వం భోజనం పెడుతుంది. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం లంచ్, రాత్రి డిన్నర్ అందించాలనే ఉద్దేశంతో చంద్రబాబు ప్రభుత్వం ఈ అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేసింది. నేటితో ఏపీలో అన్నా క్యాంటిన్ల సంఖ్య 175 కానున్నాయి. ముఖ్యమైన అన్ని ప్రాంతాల్లో పేదలకు తక్కువ ధరకే నాణ్యమైన భోజనం అందించేందుకు ఈ అన్నా క్యాంటిన్లను కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. దశల వారీగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.