తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈరోజు సాయంత్రం 6 గంటలకు సచివాలయ ప్రాంగణంలో విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. లక్ష మంది మహిళల సమక్షంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లిని ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమంలో సీఎం భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రులు, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ కార్యకర్తలు, స్వయం సహాయక సంఘాల మహిళలు, రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన మహిళలు తరలివచ్చేలా ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. విగ్రహ రూపకల్పనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించినట్లు సమాచారం. ఆయన సూచనల మేరకు విగ్రహ నమూనాను సిద్ధం చేసి, అందుకు అనుగుణంగా విగ్రహాన్ని తయారు చేశారు. ఈ కార్యక్రమానికి ప్రతిపక్ష పార్టీలను కూడా ఆహ్వానించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
గత తెలంగాణ తల్లి విగ్రహం, జరీ అంచు ఉన్న పట్టుచీర, మెడలో కంటె, బంగారు హారం ఎడమ చేతిలో బతుకమ్మ, కుడి చేతిలో మొక్కజొన్న చేతికి బంగారు గాజులు కాళ్లకు వెండి మెట్టెలు నడుముకు వడ్డాణం ఉండగా, చేతిలో వరి, జొన్న, మొక్క జొన్న, సజ్జ అభయహస్తంగా కుడిచేయి చేతికి ఆకుపచ్చ గాజులు, పట్టీలు, పీఠంలో పిడికిళ్లు పోరాట పటిమను ప్రతిబింబిస్తుంది. తెలంగాణ తల్లి విగ్రహం రూపంలో రాచరికానికి సంబంధించిన ఆనవాళ్లు లేకుండా ప్రభుత్వం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంది.