ఈరోజు నుండి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 10.30 గంటలకు అసెంబ్లీ ప్రారంభం కానుంది. సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలనే దానిపై నిర్ణయం తీసుకోనున్నారు. ఇవాళ తొలిరోజు 5 కీలక బిల్లులతో పాటు, 2 నివేదికలను సభలో ప్రవేశ పెట్టనున్నారు. ఇక సోనియా గాంధీ పుట్టిన రోజు సందర్భంగా సభలో సీఎం ప్రస్తావించనున్నారు.

తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుపై సభలో ప్రకటన చేయనున్నారు. విగ్రహ మార్పుపై సభలో సీఎం రేవంత్ వివరించనున్నారు. ఈ సెషన్లలో కొత్త ROR చట్టం ప్రవేశపెట్టబడుతుంది. కొత్త గ్రామ రెవెన్యూ వ్యవస్థను పునఃప్రారంభిస్తున్న నేపథ్యంలో అందరి దృష్టి ఈ బిల్లుపైనే ఉంది. దీంతో పాటు తెలంగాణ వైద్య విధాన పరిషత్‌ను ప్రభుత్వంలో విలీనం చేసి సెకండరీ హెల్త్ డైరెక్టరేట్‌గా మార్చే బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉంది. జీతాల చెల్లింపు, పెన్షన్లు, అనర్హుల తొలగింపు (సవరణ) ఆర్డినెన్స్ 2024, తెలంగాణ మున్సిపల్ కార్పొరేషన్ల (సవరణ) ఆర్డినెన్స్ 2024 ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *