విద్యార్థులను రాజకీయం చేయవద్దని, విద్యార్థి నాయకుడిగా సమస్యలపై తనకు అవగాహన ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ఇవాళ సిద్దిపేటలో పర్యటించారు. జిల్లా కలెక్టర్ మను చౌదరితో కలిసి జ్యోతిబాపూల్ గురుకులాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. వంటశాలను, ఆహార పదార్థాలను పరిశీలించిన అనంతరం సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ విద్యార్థుల సమస్యలను తెలుసుకుని పరిష్కరించాలని అధికారులకు సూచించారు. తెలంగాణ గురుకులాలు, హాస్టళ్లలో గతంలో కంటే మెరుగైన సౌకర్యాలు ఉన్నాయి.
గురుకులాలు, హాస్టళ్ల పర్యవేక్షణకు జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు శాఖల అధికారులతో కమిటీని ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి 15 రోజులకోసారి అధికారులు సందర్శించి నివేదిక తయారు చేయాలి. ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశం లేకుండా అన్ని రకాల ఆహార పదార్థాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. కాస్మెటిక్ & డైట్ ఛార్జీలను ప్రభుత్వం పెంచింది. ఎవరో రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి ఏమైనా సూచనలు చేయాలనుకుంటే విద్యార్థులపై రాజకీయాలు చేయొద్దు. విద్యార్థి నాయకుడిగా సమస్యలు తెలుసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు.