బీజేపీ రాష్ట్ర కార్యాలయం ఎదుట ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాంగ్రెస్ బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ. బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించిన యూత్ కాంగ్రెస్ నేతలపై బీజేపీ ఎదురుదాడికి దిగింది.బీజేపీ కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు రాళ్లు రువ్వారు. బీజేపీ కార్యకర్తలు కర్రలు పట్టుకుని బయటకు వచ్చారు. బీజేపీ కార్యాలయంపై రాళ్లు రువ్వడంతో దళిత మోర్చా కార్యకర్త తలకు గాయాలయ్యాయి. ఇది పోలీసుల వైఫల్యమేనని బీజేపీ ఆరోపిస్తోంది. ఇక్కడికి ఎలా వచ్చారని అడిగారు. మరోవైపు ప్రియాంక గాంధీపై బీజేపీ సీనియర్ నేత రమేష్ బిదూరి అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో బీజేపీ కార్యాలయం ముట్టడికి కాంగ్రెస్ పిలుపునిచ్చింది.
ఇదిలా ఉండగా, ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పొలిటికల్ పార్టీల మధ్య మాటలు హద్దు మీరుతున్నాయి. ఇటీవల ఢిల్లీ బీజేపీ సీనియర్ నేత రమేష్ బిదూరి వయనాడ్ కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఫిబ్రవరిలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ప్రస్తుత ముఖ్యమంత్రి అతిషిపై బీజేపీ తరపున బిదూరి పోటీ చేస్తున్నారు. ఇప్పటికే ఆయనను అభ్యర్థిగా కమలం పార్టీ ప్రకటించింది. అయితే, బిదూరి తాజాగా మాట్లాడుతూ ప్రియాంక గాంధీపై మాట తూలారు. తాను ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిస్తే కల్కాజీ నియోజకవర్గంలోని రోడ్లను ప్రియాంక బుగ్గల్లా నున్నగా తయారు చేస్తానని హాట్ కామెంట్స్ చేసి వివాదంలో ఇరుక్కున్నారు.