భారత ప్రధాని నరేంద్ర మోదీకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఓ ప్రత్యేక బహుమతిని అంద‌జేశారు. ‘Our Journey Together’ అనే పుస్త‌కాన్ని ప్ర‌ధానికి అధ్య‌క్షుడు బహుమతిగా అందజేశారు. ‘మిస్టర్ ప్రైమ్ మినిస్టర్, యు ఆర్ గ్రేట్’ అంటూ ట్రంప్ పుస్తకంపై సంతకం చేశారు. 320 పేజీల ఈ పుస్తకంలో ‘హౌడీ మోదీ’, ‘నమస్తే ట్రంప్’ కార్యక్రమాల తాలూకు ఫొటోల‌ను పొందుప‌రిచారు.

2019లో హ్యూస్టన్‌లోని ఫుట్‌బాల్ స్టేడియంలో నిర్వహించిన ‘హౌడీ మోడీ’ ర్యాలీకి 50,000 మందికి పైగా భారతీయ అమెరికన్లు హాజరైన సంగతి తెలిసిందే. ఈ ర్యాలీలో మోదీ, ట్రంప్‌ ఇద్దరూ ప్రసంగించారు. ఐదు నెలల తర్వాత ఫిబ్రవరి 2020లో అహ్మదాబాద్‌లోని ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియంలో ‘నమస్తే ట్రంప్’ కార్యక్రమం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *