బీఆర్ఎస్ నేత, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి ఇటీవల లగచర్ల దాడి కేసులో అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. నేడు మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. నాలుగు రోజుల క్రితం చర్లపల్లి జైలులో తనను ప్రత్యేక బ్యారక్‌లో ఉంచాలంటూ పట్నం నరేందర్‌రెడ్డి హౌజ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు హైదరాబాద్ చర్లపల్లి జైల్లో ఉన్న ఆయనను తోటి ఖైదీలతో ఉంచకుండా ఆయనకు ప్రత్యేక బ్యారక్ ఇవ్వాలని జైలు సూపరింటెండెంట్ ను హైకోర్టు ఆదేశించింది. అంతేకాదు… ఇంటి భోజనం తెప్పించుకోవడానికి కూడా అనుమతించింది.
మరోవైపు నరేందర్ రెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై విచారణను వికారాబాద్ కోర్టు వాయిదా వేసింది. రిమాండ్ ఆర్డర్ ను క్వాష్ చేయాలనే పిటిషన్ హైకోర్టులో పెండింగ్ లో ఉన్నందున బెయిల్ పిటిషన్ విచారణను వాయిదా వేస్తున్నట్టు తెలిపింది. తదుపరి విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.