కాంగ్రెస్ చేపట్టిన కులగణన కాకి లెక్కలని, ఓసీలు, ఎస్సీ ల జనాభా పెరుగుదలతో వ్యత్యాసం ఉందన్నారు ఎమ్మెల్సీ కవిత. ఇవాళ ఆమె కరీంనగర్ నగరంలోని కోతి రాంపూర్ లో మీడియాతో మాట్లాడుతూ, బీసీ లకు 56.3% రిజర్వేషన్ అమలు చేశాకే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళనున్నారు. ఉద్యమానికి తలొగ్గి కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ కమిషన్ ఏర్పాటు చేసిందన్నారు. కానీ బీసీ గణన సరిగా జరగలేదు అనే మాట ప్రతి చోట వినిపించిందని, కేసీఆర్ సమగ్ర కుటుంబ సర్వే ఒకే రోజు విజయవంతంగా నిర్వహించారన్నారు. బీసీల జనాభా కేవలం 46.2 మాత్రమే ఉన్నదా నిన్న ఆగమాగం లెక్కలు పెట్టినారు రేపు అసెంబ్లీ లో పెడుతారట అని ఆమె విమర్శించారు. పెడితే బిల్లు పెట్టండి, మీ నాయకుడు రాహుల్ గాంధీ చెప్పినట్లు వెంటనే మైనార్టీ లతో కలుపుకొని 56.3 శాతం బీసీ లకు వెంటనే రిజర్వేషన్ లు పెట్టీ మీ చిత్త శుద్ధి నిరూపించుకొండి అని ఆమె వ్యాఖ్యానించారు.
అంతేకాకుండా, ’ఇదే మోసం మీరు కర్ణాటకలో చేశారు అదే మోసం తెలంగాణలో చేస్తున్నారు. మీరు చెప్పిన లెక్కలు కాకి లెక్కలు మేము ఏమన్నా అంటే ఎన్నికలకు అడ్డుపడుతున్న అంటారు. 21 లక్షల మంది బీసీ ల లెక్క తేడా వస్తున్నది కాబట్టి 15 రోజులు రివ్యూ కు అవకాశం ఇవ్వాలి. ఈ విషయంలో మేము అందరూ పెద్దలను కలుస్తాము పోరాటాలకు మేము ఎప్పుడు సిద్ధం. కామారెడ్డి డిక్లరేషన్ లో 42 శాతం అన్నారు. ఇప్పుడు మైనార్టీలతో కలుపుకుని 56.3% బీసీలను మీరే అంటున్నారు, కదా మరి 56.3% రిజర్వేషన్లు ఇచ్చి మీరు ఎన్నికలకు వెళ్ళాలి’ అని ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యానించారు.