నా గురించి మాట్లాడే హక్కు మీకు లేదని కొండా సురేఖపై ఆర్‌ఎస్ ప్రవీణ్ ఫైర్ అయ్యారు. ఆర్‌ఎస్ కుట్రచేసి విష ఆహారం తినిపిస్తున్నారన్న కొండా సురేఖ మాటలకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ, మీరు ఒక మాతృమూర్తి, మీకు ఒక ఆడపిల్ల ఉంది.అలాంటి మాటలు మాట్లాడ వచ్చా? అని ప్రశ్నించారు. నా సొంత పిల్లలను వదిలేసి, వేలాది మంది విద్యార్థులను నా పిల్లలు అనుకొని సేవ చేశానని గుర్తు చేశారు. వరంగల్ లో మీరు ఎన్నో అఘాయిత్యాలు చేశారన్నారు.
మీకు చేత కాకపోతే విద్యాశాఖను బీఆర్‌ఎస్‌కు అప్పగించండి అన్నారు. కొండా సురేఖ స్థాయికి నేను దిగజారి దలుచుకోలేదని అన్నారు. మీరు భవిష్యత్‌లో తెలంగాణలో మాట్లాడకండి అని సూచించారు. మీరు మాట్లాడిన మాటలు వినలేక తెలంగాణలో మహిళలు తల దించు కుంటున్నారు అన్నారు. కోర్టు కూడా కొండా సురేఖ భాష వినలేక పోయిందని ఆర్‌ఎస్ తెలిపారు. మీకు మంత్రి పదవి లో ఉండే అర్హత లేదని కీలక వ్యాఖ్యలు చేశారు. నా గురించి మాట్లాడే హక్కు కూడా మీకు లేదన్నారు. నేను దేశం కోసం పోరాడిన వ్యక్తిని అన్నారు. ఎక్కడో అలంపూర్ మారుమూల గ్రామంలో పుట్టిన నేను ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన హార్వార్డ్ యూనివర్సిటీలో చదువుకున్నాను అని గుర్తుచేశారు ప్రవీణ కుమార్. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నాకు ఎన్నో అవార్డులు వచ్చాయని తెలిపారు.