మంత్రి కొండా సురేఖకు నాంపల్లి కోర్టు నోటీసులు జారీ చేసింది. సినీ హీరో అక్కినేని నాగార్జున దాఖలు చేసిన పరువు నష్టం దావా కేసుకు సంబంధించి నాంపల్లి కోర్టు మంత్రి సురేఖకు నోటీసులు పంపింది. అనంతరం నాగార్జున పిటిషన్ పై విచారణను 2024, అక్టోబర్ 23వ తేదీకి వాయిదా వేసింది. కాగా, నాగచైతన్య, సమంత విడాకులపై మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. నాగచైతన్య, సమంత విడాకులకు కేటీఆరే కారణమంటూ మంత్రి సురేఖ చేసిన కామెంట్స్ రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు సినీ ఇండస్ట్రీని షేక్ చేశాయి.

ఈ క్రమంలో తమ కుటుంబ గౌరవానికి భంగం కలిగించేలా మంత్రి సురేఖ కామెంట్స్ చేశారంటూ అక్కినేని నాగార్జున కోర్టు ఆశ్రయించారు. మంత్రి కొండా సురేఖపై పరువు నష్టం దావాతో పాటు క్రిమినల్ కేసు నమోదు చేయాలని పిటిషన్లు దాఖలు చేశారు. నాగార్జున పిటిషన్‎పై ఇవాళ విచారణ చేపట్టిన నాంపల్లి కోర్టు సాక్ష్యుల స్టేట్మెంట్లను రికార్డ్ చేసింది. అనంతరం మంత్రి కొండా సురేఖకు నోటీసులు జారీ చేస్తూ, కేసు తదుపరి విచారణను ఈ నెల 23వ తేదీకి వాయిదా వేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *