రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వీడియో సందేశం ద్వారా వాహనదారులకు విజ్ఞప్తి చేశారు. ముందుగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఏటా సగటున లక్షా 60వేల మంది రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారన్నారు. తెలంగాణలో రోజుకు సగటున 20 మంది రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారని తెలిపారు. దసరా నాడు చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఈ దసరా ఆయుధ పూజలో కుటుంబ సభ్యులందరితో కలిసి ప్రతిజ్ఞ చేద్దాం అని కోరారు.