తెలంగాణ బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీని కలవనున్నారు. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు పార్లమెంట్‌లోని ప్రధాని కార్యాలయంలో వీరిద్దరూ సమావేశం కానున్నారు. నియోజకవర్గాల అభివృద్ధి అంశాలతో పాటు తెలంగాణలో పార్టీ పరిస్థితిపై చర్చించనున్నారు. ప్రధానితో భేటీ అనంతరం కిషన్ రెడ్డి నివాసంలో బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో బీజేపీ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. పార్టీ ఎన్నికల వేళ బీజేపీ నేతల భేటీ కీలకంగా మారింది.
ఇలాంటి పరిస్థితుల్లో ప్రధాన ప్రతిపక్షంగా బీజేపీ రంగంలోకి దిగి స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది. అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా కొత్త వారిని నియమించే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రధానితో భేటీలో కేటాయింపుతోపాటు పలు కీలక అంశాలపై ఎంపీలు చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం. మరోవైపు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. మంగళవారం భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఉభయ సభలకు సెలవు ప్రకటించారు.