మన్మోహన్ సింగ్ కు భారతరత్న ఇవ్వాలని, మన్మోహన్ సింగ్ విగ్రహం తెలంగాణలో ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మంచి ప్రదేశంలో మన్మోహన్ సింగ్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని సీఎం చెప్పారు. తెలంగాణ అసెంబ్లీ ఈరోజు ఉదయం ప్రారంభమైంది. అసెంబ్లీలో మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు నివాళులు అర్పించారు. సీఎం రేవంత్ రెడ్డి సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.
మన్మోహన్ ప్రధానిగా ఉన్న సమయంలోనే తెలంగాణ ఏర్పడిందన్నారు. రాష్ట్ర ఏర్పాటులో మన్మోహన్ సింగ్ కృషిని కొనియాడారు. ఉపాధి హామీ, ఆర్టీఎల్ వంటి చట్టాలను తీసుకొచ్చిన ఘటన మన్మోహన్ సింగ్ అన్నారు. సరళీకరణ విధానాలు భారతదేశాన్ని ప్రపంచంతో పోటీపడేలా చేశాయి. మన్మోహన్ సింగ్ దేశానికి విశిష్ట సేవలు అందించారు. నిర్మాణాత్మక సంస్కరణల అమలులో మన్మోహన్ సింగ్ కీలకపాత్ర పోషించారని అన్నారు.