మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ రెండు రాష్ట్రాల్లోనూ తొలి ట్రెండ్స్‌లో బీజేపీ కూటమి పుంజుకుంది. ప్రత్యర్థి పార్టీల కంటే బీజేపీ, దాని మిత్రపక్షాలకే ఎక్కువ సీట్లు ఉన్నాయి.
మహారాష్ట్రలోని 288 అసెంబ్లీ స్థానాల్లో ప్రస్తుతం బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి 55 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ నేతృత్వంలోని మహావికాస్ అఘాడీ 15 స్థానంలో లీడింగ్‌లో కొనసాగుతోంది. జార్ఖండ్‌లోని 81 స్థానాల్లో ప్రస్తుతం బీజేపీ కూటమి 25 స్థానాల్లో, కాంగ్రెస్+జేఎంఎం 10 స్థానాల్లో లీడింగ్‌లో ఉంది. కొప్రి నుంచి మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే, నాగ్‌పూర్ నుంచి డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఇద్దరూ లీడింగ్‌లో ఉన్నారు. ఇక జార్ఖండ్ సీఎం హేమంత్ సొరెన్ బర్హత్ స్థానం నుంచి లీడింగ్‌లో ఉన్నారు.