తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ మళ్లీ మహారాష్ట్ర వెళ్లనున్నారు. ఇవాళ, రేపు రెండు రోజుల పాటు మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. ఈరోజు ఉదయం 10 గంటలకు హైదరాబాద్ నుంచి నాగ్‌పూర్ వెళ్లనున్నారు. అక్కడ చంద్రాపూర్ నాయకులతో కలిసి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆ తర్వాత వరుసగా రాజురా, దిగ్రాస్, వార్దా నియోజకవర్గాల్లో ప్రచార సభలు, రోడ్ షోలలో పాల్గొని రాత్రికి నాగ్ పూర్ చేరుకుంటారు. వారు అక్కడే ఉంటారు. రెండో రోజైన ఆదివారం ఉదయం నాగ్‌పూర్ నుంచి నాందేడ్ చేరుకుంటారు. నైకౌ, భోకర్, షోలాపూర్ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. ప్రచారం అనంతరం అక్కడి నుంచి తిరిగి హైదరాబాద్‌కు చేరుకుంటారు.
తెలుగువారు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్‌కు చెందిన రాష్ట్ర మంత్రులు, ఎంపీలు ప్రచారంలో పాల్గొంటున్నారు. ఎన్డీయే నుంచి కేంద్రమంత్రులు జి.కిషన్ రెడ్డి, బండి సంజయ్ ప్రచారంలో సందడి చేశారు. తెలుగు ప్రజలు ఎక్కువగా ఉండే ముంబైలో బీజేపీ నేతలు తమ మిత్రపక్షం ఏపీ సీఎం చంద్రబాబు బాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లను ప్రచారానికి ఆహ్వానించారు. ఈనేపథ్యంలో నేడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రచారానికి వెళ్లనున్నట్లు సమాచారం.