మహారాష్ట్ర ముఖ్యమంత్రి పేరుపై నేడు స్పష్టత రానున్నది. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలలో మహాయుతి కూటమి విజయం సాధించిన విషయం తెలిసిందే , ముఖ్యమంత్రి ఎంపికపై చివరి నిర్ణయం ఇంకా వెలువడలేదు. మూడు పార్టీల నేతలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమావేశమై చర్చలు జరిపారు.
ఈ సారి అత్యధిక స్థానాలను గెలుచుకున్న భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ముఖ్యమంత్రి పదవిని చేపట్టనుందని సమాచారం. అయితే, ముఖ్యమంత్రి పదవికి ఎవరిని నియమించాలనే అంశంపై ప్రధాని మోదీ, అమిత్ షాల నిర్ణయం కీలకమని మహాయుతి నేతలు వెల్లడించారు. మంత్రి వర్గంలో భాగస్వామ్యంపై చర్చలు పూర్తయ్యాయి. ఈ నెల 5వ తేదీన మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయనున్నారని ఇప్పటికే ముహూర్తం నిర్ణయించారు. ఈ నేపథ్యంలో,నేడు ముఖ్యమంత్రి అభ్యర్థి పేరును ప్రకటించే అవకాశం ఉందని భావిస్తున్నారు.