మంత్రి నారా లోకేష్ ఈరోజు మంగళగిరిలోని ఆల్ఫా అరేబియన్ రెస్టారెంట్‌లో పారిశుధ్య కార్మికులతో టీ తాగారు. వారితో ఉల్లాసంగా ముచ్చటించారు. వారిని సత్కరించి, కానుకలు అందజేశారు. ఈ విషయాన్ని లోకేష్ తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా వెల్లడించారు.
“మంగళగిరి పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుతూ, తెర వెనుక యోధులు అనదగ్గ పారిశుద్ధ్య కార్మికులను కలవడం గౌరవంగా భావిస్తున్నాను. పని పట్ల వారి అంకితభావం నిజంగా స్ఫూర్తిదాయకం. మన వీధులు, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడానికి వారు అవిశ్రాంతంగా శ్రమిస్తుండడం పట్ల ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను” అని లోకేశ్ వివరించారు. ఈ మేరకు పారిశుద్ధ్య కార్మికులతో ఫొటోలను పంచుకున్నారు.