లోక్ మంథన్ వేడుకలకు భాగ్యనగరం వేదికైంది. లోక్ మంథన్‌ను రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము నేడు ప్రారంభించనున్నారు. ఈరోజు ఉదయం 10.20 గంటలకు శిల్పకళా వేదికలో లోకమంతన్ ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 12.05 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి ఢిల్లీకి బయలుదేరుతారు. లోకమంతన్ ఆహ్వాన సంఘం గౌరవాధ్యక్షుడిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నియమితులయ్యారు. నిన్న లోక్ మంథన్ కార్యక్రమంలో భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మంత్రి జూపల్లి కృష్ణారావు శిల్పారామంలో ప్రదర్శనను ప్రారంభించిన సంగతి తెలిసిందే.
రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో ఇవాళ ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:15 గంటల వరకు ఈ జంక్షన్లలో ట్రాఫిక్ నిలిపివేయనున్నారు. రాజ్ భవన్ కుడివైపు వీవీ విగ్రహం, కేసీపీ అన్సారీ మంజిల్- తాజ్‌కృష్ణ, ఎన్ఎఫ్సీఈఎల్ ఎస్ఎల్టీ, సాగర్ సొసైటీ, ఎన్టీఆర్ భవన్, జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్, రోడ్ నెం-45 జంక్షన్, కేబుల్ బ్రిడ్జ్, రోడ్ నెం-65, జూబ్లీ హిల్స్, ఎన్టీఆర్ భవన్, సాగర్ సొసైటీ, ఎస్ఎన్టీ- ఎన్ఎఫ్సీఎస్, పంజాగుట్ట వంతెన, ప్రజా భవన్, బేగంపేట్ ఎయిర్‌పోర్ట్ వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని అధికారులు వెల్లడించారు.