నల్లబట్టలు ధరించి అసెంబ్లీకి వస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై మంత్రి కోమటిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అంతర్జాతీయ చట్టాల ప్రకారం కార్ రేసింగ్ కేసులో కేటీఆర్ కు బెయిల్ వచ్చే అవకాశం లేదని అన్నారు. కేటీఆర్ జైలుకు వెళ్లక తప్పదు. ఏడేళ్లపాటు జైల్లో ఉండాల్సి వస్తుందని చెప్పారు.
అందుకే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేటీఆర్ కు బెయిల్ రావాలని మొక్కుతున్నారని చెప్పారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు శబరిమలకు వెళ్లడానికి నల్ల దుస్తులు ధరించినట్టుందని ఎద్దేవా చేశారు. కేటీఆర్ అరెస్ట్ అయితే ఆయనకు బెయిల్ రావాలని శబరిమలకు వెళ్లి మొక్కుతారని అన్నారు. మరోవైపు కేటీఆర్ పై విచారణకు రాష్ట్ర గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.