ఫార్ములా కార్ రేస్ కేసులో విచారణ నిమిత్తం కేటీఆర్ ఏసీబీ కార్యాలయానికి వచ్చిన సమయంలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. విచారణ జరగకుండానే ఏసీబీ కార్యాలయం నుంచి వెళ్లిపోయారు. కేటీఆర్ తన లాయర్లను లోపలికి అనుమతించకపోవడంతో ఏసీబీ కార్యాలయం నుంచి కేటీఆర్ వెళ్లిపోయారు. పోలీసులు, కేటీఆర్ బృందానికి మధ్య 40 నిమిషాల పాటు వాగ్వాదం జరిగింది. వెళ్లే ముందు కేటీఆర్ ఏసీబీ అధికారులకు లేఖ ఇచ్చారు.
ఆ లేఖలో ఈ కేసుకు సంబంధించిన తీర్పు ఇప్పటికే కోర్టులో రిజర్వ్ చేయబడింది. ఆ తీర్పు ఎప్పుడైనా వచ్చే అవకాశం ఉంది. ఉత్తర్వులు పెండింగ్‌లో ఉన్నప్పటికీ విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేశామన్నారు. కానీ కేసుకు సంబంధించిన పత్రాలతో పాటు అవసరమైన సమాచారం, ఇతర వివరాలు ఇవ్వలేదని నోటీసులో పేర్కొన్నారు. అందువల్ల హైకోర్టు రిజర్వ్ చేసిన తీర్పు వెలువడే వరకు విచారణకు రాలేనని కేటీఆర్ లేఖలో పేర్కొన్నారు.