బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి కే. తారక రామారావుకు (కేటీఆర్) మరో అరుదైన గౌరవం లభించింది. అమెరికాలోని ఇల్లినాయిస్ రాష్ట్రం ఇవాన్‌స్టన్ పట్టణంలో ఉన్న నార్త్‌వెస్టర్న్ యూనివర్సిటీలో ఏప్రిల్ 19, 2025న జరగనున్న కెల్లాగ్ ఇండియా బిజినెస్ కాన్ఫరెన్స్ (KIBC-2025) లో కేటీఆర్ ముఖ్య అతిథిగా ప్రసంగించనున్నారు. ఈ మేరకు కాన్ఫరెన్స్ వైస్ ప్రెసిడెంట్ చెనాక్షా గోరెంట్ల ప్రత్యేకంగా లేఖ ద్వారా ఆహ్వానం పంపారు.
కేటీఆర్ తన మంత్రిత్వ కాలంలో తెలంగాణను పారిశ్రామిక, టెక్నాలజీ రంగాల్లో అగ్రగామిగా తీర్చిదిద్దారని KIBC నిర్వాహకులు ప్రశంసించారు. టీ-హబ్, టీ-వర్క్స్, వీ-హబ్ వంటి వినూత్న ఆవిష్కరణల ద్వారా స్టార్టప్ ఎకోసిస్టమ్ అభివృద్ధికి అద్భుతమైన వేదికగా తెలంగాణ నిలిచిందన్నారు. ఈ విధానాలు దేశంలోని ఇతర రాష్ట్రాలకు మోడల్‌గా నిలిచాయని చెనాక్షా గోరెంట్ల పేర్కొన్నారు.