బీఆర్‌ఎస్ చీఫ్ కేసీఆర్ వ్యాఖ్యలపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ, కేసీఆర్ ప్రతిపక్ష నేతగా విఫలమయ్యారన్నారు. ఫామ్ హౌస్ లో కుంభకర్ణుడిలా నిద్రపోయాడని, నా ఛాలెంజ్ కు స్పందించి కేసీఆర్ బయటికి రావడం నాకు సంతోషంగా ఉందన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కేసీఆర్ తడాఖా తెలిసిందని ఆయన విమర్శించారు. తెలంగాణ సాధనలో కేసీఆర్ పాత్ర లేదని, నాలాంటి వాళ్లు పదవి త్యాగం చేయడం వల్ల తెలంగాణ వచ్చిందన్నారు. కాంగ్రెస్ పార్టీ వల్లే తెలంగాణ కల సహకారం అయిందని, దొంగ దీక్షలు చేయడం కేసీఆర్ కు అలవాటు అని మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు. నేను కొడితే మీ పార్టీ కూడా లేవదని, దమ్ముంటే అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ రావాలన్నారు మంత్రి కోమటిరెడ్డి.
ప్రభాకర్ రావు, శ్రావణ్ లు ఇండియాకు రావద్దని కేసీఆర్ చెప్పాడని, పదేళ్ల బిఆర్ఎస్ ఐ యాంలో జరిగిన అభివృద్ధి, ఏడాది కాలంలో జరిగిన అభివృద్ధిపై చర్చకు సిద్ధమా, అని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్యానించారు. అంతేకాకుండా బీఆర్ఎస్ చేసిన అప్పులకు అధికారంలో ఉన్న కాంగ్రెస్ అప్పులు కడుతుందన్నారు. కేసీఆర్ భయపెడితే, భయపడే వాళ్ళు ఎవరూ లేరని ఆయన మండిపడ్డారు. మళ్లీ అధికారంలోకి వచ్చేది మేమే అని, లోకల్ బాడీ ఎన్నికల్లో చూసుకుందాం, ఒక్క జిల్లా పరిషత్ స్థానం గెలుస్తారా అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్యానించారు.