ఆంధ్రప్రదేశ్‌లో ఖాళీ అవుతున్న మూడు రాజ్యసభ స్థానాలకు సంబంధించి తాజాగా జనసేన నేత నాగబాబు స్పష్టత ఇచ్చారు. తనకు ఎలాంటి రాజకీయ పదవులపై ఆసక్తి లేదని ఆయన వెల్లడించారు. గత కొన్ని రోజులుగా మూడు రాజ్యసభ స్థానాల్లో ఒకటిని జనసేనకు కేటాయించి, ఆ పదవిని నాగబాబుకే ఇవ్వనున్నారని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.
అయితే ఈ ప్రచారాన్ని నాగబాబు ఖండించారు. ఆయన ట్విటర్ ద్వారా స్పందిస్తూ, తాను రాజకీయ పదవులపై ఆసక్తి చూపడం లేదని స్పష్టం చేశారు. దీంతో నాగబాబును రాజ్యసభకు పంపనున్నారనే వార్తల్లో వాస్తవం లేదని తేలిపోయింది. ఇకపోతే, మూడు రాజ్యసభ స్థానాల్లో అన్నింటినీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఆక్రమిస్తారా? లేదా అందులో ఒకటిని బీజేపీకి కేటాయిస్తారా? అనే అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. నాగబాబు వ్యాఖ్యలతో ఈ అంశంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.