జనగామ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు మాజీ ఉప ముఖ్యమంత్రి మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య. ఈ సందర్భంగా తాటికొండ రాజయ్య మాట్లాడుతూ.. షన్ ఘనపురం నియోజకవర్గంలో ఒక రాక్షస పాలన జరుగుతుందన్నారు. పాతరోజులను తలపించే విధంగా కడియం శ్రీహరి మల్లీ అరాచకపు పాలన కొనసాగిస్తున్నాడని, ఆరు నెలల్లో ఆరుగురిపై అక్రమ కేసులు పెట్టించాడన్నారు తాటికొండ రాజయ్య. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల చెమటతో గెలిచి ఊసరవెల్లి లాగ పార్టీ మారి ఇప్పుడు వారిపైనే అక్రమ కేసులు పెడుతుండు అని ఆయన ఆరోపించారు. ప్రతిపక్షంగా ప్రశ్నించే హక్కు మాకు రాజ్యాంగం కల్పించిందని, బీఆర్ఎస్ కార్యకర్త కేశిరెడ్డి మనోజ్ రెడ్డి కడియం గెలుపుకోసం ఎంతో శ్రమించాడన్నారు.

‘ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు ఆయన పై అక్రమ కేసులు పెట్టించి రాక్షస ఆనందం పొందుతునాడు. సీఎం రేవంత్ రెడ్డి 420 రోజులైంది 420 హామీలలో ఏ ఒక్కటి నెరవేర్చలేదు. గాంధీ వర్దంతి సంధర్బంగా రేవంత్ రెడ్డి మనసు మార్చాలని కోరుతూ గాంధీజీ విగ్రహానికి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. ఒకప్పుడు కడియం శ్రీహరి పది సంవత్సరాలు టిడిపిలో ఉండి నియోజకవర్గ ప్రజల ఉసురు పోసుకునాడు. ఇప్పుడు ఊసరవెల్లిలా రంగులు మార్చుతూ పార్టీలు మారాడు. దమ్ముంటే బిఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మల్లీ గెలువు, కాంగ్రెస్ ప్రభుత్వం కోతల ప్రభుత్వం, అబద్దాల ప్రభుత్వం, అక్రమ కేసులు,అక్రమ నిర్బందాన్ని ప్రజలు గమనిస్తున్నారు.’ అని తాటికొండ రాజయ్య వ్యాఖ్యానించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *