హైదరాబాద్‌లో 100 అడుగుల ఎన్టీఆర్‌ విగ్రహాన్ని టీడీపీ జనార్ధన్‌ ఏర్పాటు చేస్తామన్నారు. టీడీపీ స్థాపించిన స్థలంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని జనార్ధన్‌ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం భూమి ఇచ్చిన తర్వాత విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని చెప్పారు. కార్యక్రమానికి సీఎం చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు. ఈ సందర్భంగా ముందుగా టీడీపీ స్థాపించిన స్థలంలో వంద అడుగుల ఎన్టీఆర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. తెలుగు ప్రజలందరినీ కలుపుకుపోవాలనే లక్ష్యంతో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారని గుర్తు చేశారు.

ప్రపంచ వ్యాప్తంగా టీడీపీ కార్యకర్తలు ఉన్నారు. ఎన్టీఆర్ చేసిన సేవలకు ఇప్పటికే ప్రపంచ దేశాల నుంచి మంచి గుర్తింపు వచ్చిందన్నారు. ఈ ఏడాది చివరి నాటికి హైదరాబాద్ నగరంలో అన్నగారి విగ్రహాన్ని నెలకొల్పి తెలుగు ప్రజలకు అంకితం చేస్తామన్నారు. శత జయంతి సందర్భంగా ఎన్టీఆర్ చైతన్య యాత్రలు, అసెంబ్లీ ప్రసంగాలు రెండు పుస్తకాల్లో ఇచ్చారు. ఇప్పుడు తారకరామం అనే పుస్తకాన్ని విడుదల చేయనున్నట్లు వివరించారు. 24న సాయంత్రం విజయవాడలో పుస్తకావిష్కరణ జరగనుంది.
తెలంగాణ ప్రభుత్వం భూమి ఇచ్చిన తరువాత విగ్రహావిష్కరణ జరుగుతుందని స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *