కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మానవత్వం ప్రదర్శించారు. హుజారాబాద్ సమీపంలోని సింగపూర్ వద్ద బైక్‌ను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దివ్యశ్రీ అనే మహిళ లారీ కింద ఇరుక్కుపోయింది. స్థానికులు కేకలు వేయడంతో కొంతదూరం వెళ్లిన లారీ డ్రైవర్ ఆగాడు. బాధితురాలిని మానకొండూరు మండలం కెల్లెడు గ్రామానికి చెందిన దివ్యశ్రీగా గుర్తించారు. ములుగు జిల్లా పర్యటనకు వచ్చిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఘటనా స్థలంలో ఆగిపోయారు. దివ్యశ్రీని బయటకు తీసేందుకు ప్రయత్నించారు. లారీకింద టైరు పక్కనే ఉన్న కంకరలో మహిళ జుట్టు ఇరుక్కుపోయింది. సంజయ్ ఆ మహిళ భయపడకు, ధైర్యంగా ఉండమని సూచించారు. చివరకు స్థానికుల సాయంతో ఆమెను బయటకు తీశారు. గాయపడిన మహిళ కరీంనగర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె చికిత్సకు అయ్యే ఖర్చును తానే భరిస్తానని సంజయ్ వైద్యులకు చెప్పాడు.
ఇదిలా ఉండగా, ములుగు జిల్లా కేంద్రానికి వచ్చిన బండి సంజయ్ కుమార్ కి గట్టమ్మ దగ్గర బీజేపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. గట్టమ్మా దర్శించుకొని, ములుగు కలెక్టరేట్ లో సమీక్ష సమావేశానికి ఆయన వచ్చారు. ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ వద్ద జిల్లా కలెక్టర్ పుష్పగుచ్ఛం అందజేసి ఘనంగా స్వాగతం పలికారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.