ఫార్ములా ఈ-కార్ రేస్ నిర్వహించిన గ్రీన్ కో సంస్థ బీఆర్ఎస్ పార్టీకి కోట్లాది రూపాయలు రాబట్టిందని తెలంగాణ ప్రభుత్వం ఆరోపించిన సంగతి తెలిసిందే. ఎన్నికల బాండ్ల ద్వారా రూ. 41 కోట్లు బీఆర్‌ఎస్ పార్టీకి చెల్లించినట్టు తెలిపింది. ఈ వ్యవహారాన్ని క్విడ్ ప్రోకోగా పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. గ్రీన్ కో 2022లో ఎన్నికల బాండ్లను ఇచ్చిందని, 2023లో ఫార్ములా ఈ-రేసు జరిగిందని చెప్పారు. ఈ కేసు కారణంగా గ్రీన్ కో స్పాన్సర్‌షిప్‌ను కోల్పోయింది మరియు మరుసటి సంవత్సరం స్పాన్సర్‌షిప్ నుండి తప్పుకుందని తెలిపారు. ఇది క్విడ్ ప్రోకో ఎలా అవుతుంది? పార్లమెంటు ఆమోదించిన బాండ్లను అవినీతిమయమని ఎలా చెబుతారని ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా అన్ని పార్టీలకు అందిన బాండ్లపై చర్చకు సిద్ధమన్నారు. తమ పార్టీపై ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు.