ఆంక్షలతో ప్రశ్నించే గొంతును అణిచివేయలేరని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేంద్రరెడ్డిని అక్రమంగా అరెస్టు చేయడం దుర్మార్గమన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. అరెస్టులు, అక్రమ కేసులు, ముందస్తు నిర్బంధాలతో పాలనను గాలికి వదిలేయడం సిగ్గుచేటన్నారు. ఫార్మాస్యూటికల్స్ పేరుతో పచ్చని పొలాలను నాశనం చేయడమేనా మీ పబ్లిక్ పాలసీ? అని అడిగాడు. రైతులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ లో పెట్టడమే మీ ఇందిరమ్మ రాజ్యమా? అని మండిపడ్డారు. అక్రమ అరెస్టులు, కేసులు, నిర్బంధాలతో ప్రశ్నించే గొంతులను అణచివేయలేరు. @BRSParty మీ బెదిరింపులకు భయపడదు. మీరు బహిరంగంగా బహిర్గతం చేయబడతారు. ప్రజల పక్షాన నిలబడతాం. అరెస్టు చేసిన పట్నం నరేందర్ రెడ్డిని, రైతులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నామని హరీష్ రావు అన్నారు.
మరోవైపు మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ, పట్నం నరేందర్ రెడ్డి నివాసం వద్దకు వెళ్లారు. పట్నం నరేందర్ రెడ్డి సతీమణితో మాట్లాడారు. అక్కడ సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ, కలెక్టర్ పై దాడి జరగడం బాధాకరమని తెలిపారు. ఈ ఘటన బీఆర్ఎస్ నేతలపై కావాలని కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి నియోజకవర్గం లో జరిగిన ఘటన అధికారుల మీద కోపంతో కాదు ముఖ్యమంత్రి మీద కోపంతో దాడి జరిగిందన్నారు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం రైతుల బాధ వినండి అన్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ల్యాండ్ కి సంబంధించి 8 నెలలు రైతులను ఒప్పించి వాళ్ళకి ఏం కావాలో తెలుసుకున్నామన్నారు. ఇది న్యాయం కాదు, రెచ్చగొట్టే విధంగా చేస్తున్నారని మండిపడ్డారు. అక్రమంగా అరెస్టు చేయడం మంచిది కాదన్నారు. ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాల వల్ల ఈ ఘటనలు జరుగుతున్నాయని మండిపడ్డారు.