తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో తమిళనాడు మంత్రి కేఎన్ నెహ్రూ, ఎంపీలు కనిమొళి, రాజాలు సమావేశమయ్యారు. డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు జరిగే నష్టం గురించి నాయకులు చర్చించనున్నారు. ఈ నెల 22న చెన్నైలో ఏర్పాటు చేసిన జేఏసీ సమావేశానికి హాజరు కావాలని సీఎం రేవంత్ కు ఆహ్వానం పలికారు.
ఈ సందర్భంగా తెలంగాణ సీఎం మాట్లాడుతూ, దక్షిణాది రాష్ట్రాలపై భారతీయ జనతా పార్టీ పగబట్టింది అని విమర్శలు గుప్పించారు. డీలిమిటేషన్ వల్ల దక్షిణాదికి తీవ్ర నష్టం వాటిల్లుతోందని దీనిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ తీసుకున్న నిర్ణయాన్ని అభినందిస్తున్నానని రేవంత్ రెడ్డి అన్నారు. ఈ నెల 22న స్టాలిన్ నిర్వహించే సమావేశంలో తాను పాల్గొంటానని ఆయన అన్నారు.