ఖమ్మం జిల్లా కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉంది. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని సీఎంఆర్ కింద మిల్లర్లకు అందజేస్తారు. ధాన్యాన్ని ప్రభుత్వానికి అప్పగిస్తామని మిల్లర్లు చెప్పారు. కానీ సీఎంఆర్‌కు అప్పగించకుండా కొన్ని సీజన్‌లుగా మిల్లర్లు పక్కన పెట్టారనే ఆరోపణలు ఉన్నాయి. వానాకాలంలో ప్రభుత్వం నుంచి ధాన్యం తీసుకున్న మిల్లర్లు బియ్యం తిరిగి ఇవ్వడం లేదు. తాజాగా జిల్లాలోని హైదరాబాద్ పౌరసరఫరాల టాస్క్‌ఫోర్స్ అధికారులు మిల్లర్ల ముఠా గుట్టును బట్టబయలు చేశారు. కొన్ని మిల్లులు గడువు కోరుతూ కోర్టును ఆశ్రయించాయి.
సీఎంఆర్ అవకతవకలకు ఎవ్వరు పాల్పడినా సహించేది లేదన్నారు. గత ప్రభుత్వంలో ధాన్యం సేకరణ మిల్లులకు తరలింపు వ్యవహారంలో జరిగిన అక్రమాలపై నిగ్గు తేల్చుతామన్నారు. ఖమ్మం జిల్లాలో మిల్లుల నుంచి ప్రభుత్వానికి రావలసిన బియ్యంను వెంటనే రాబడుతామన్నారు. బియ్యం ఇవ్వని మిల్లులపై కఠిన చర్యలు తీసుకుంటామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హెచ్చరించారు.