తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు సిద్దిపేట జిల్లాలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 1.30 గంటలకు బేగంపేట నుంచి హెలికాప్టర్‌లో సిద్దిపేటకు సీఎం వెళతారు. బండ తిమ్మాపూర్ హెచ్‌సిసిబి – సిద్ది సమీపంలో కోకాకోలా ఫ్యాక్టరీని నిర్వహిస్తారు. అలాగే మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్‌కు బయలుదేరుతారు. మధ్యాహ్నం 3.30 గంటలకు ఎన్టీఆర్ మార్క్‌లోని హెచ్‌ఎండీఏ మైదానంలో ప్రజాపరిపాలన విజయోత్సవాల్లో భాగంగా నిర్వహించే ఆరోగ్యోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ పాల్గొంటారు.
అలాగే, నేటి సాయంత్రం 4 గంటలకు అంబేడ్కర్ విగ్రహం దగ్గర ప్రజా పాలనా సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. ఇవాళ (డిసెంబర్ 2) 206 అంబులెన్స్‌లు ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభం అవుతాయి. ఇక, ప్రజాపాలన వేడుకల్లో భాగంగా 206 అంబులెన్స్‌లను రాష్ట్ర ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. 442 సివిల్ అసిస్టెన్స్ సర్జెన్స్, 24 ఫుడ్ సేఫ్టీ అధికారులకు సైతం పోస్టింగ్స్ ఇవ్వనున్నారు. 16 నర్సింగ్ కాలేజీలు, 28 పారామెడికల్ కాలేజీలను కూడా రేవంత్ రెడ్డి మంజూరు చేయనున్నారు.