తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూసీ పునరుజ్జీవ యాత్రను ప్రారంభించారు. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం సంగెం గ్రామం నుంచి ఆయన ఈ యాత్రను ప్రారంభించారు. యాత్రను ప్రారంభించడానికి ముందు మూసీ నదిలోని నీటిని ముఖ్యమంత్రి పరిశీలించారు. ఆయన స్వయంగా ఓ బాటిల్‌తో మూసీ నీటిని ఒడిసి పట్టుకున్నారు.
రేవంత్ రెడ్డి మూసీ పునరుద్ధరణ యాత్రకు పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణులు, రైతులు హాజరయ్యారు. సంగెం నుంచి భీమలింగం వరకు రేవంత్ రెడ్డి పాదయాత్ర కొనసాగుతుంది. సంగెం వద్ద ప్రసిద్ధ శివలింగానికి సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. దాదాపు 2.5 కిలోమీటర్ల మేర ఈ యాత్ర ఉంటుంది.