తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేస్తామన్న హామీ అందరికీ తెలిసిందే. అధికారంలోకి వచ్చిన వెంటనే, కాంగ్రెస్ ప్రభుత్వం ఆ హామీలను నెరవేర్చడానికి కట్టుబడి పనిచేస్తోంది. పేదలపై కరెంట్ బిల్లు భారం తగ్గించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ‘గృహజ్యోతి’ పథకాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ పథకం ప్రకారం, నెలకు 200 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగించే కుటుంబాలకు ఉచితంగా కరెంట్ అందిస్తుంది. దీని ద్వారా ఆ కుటుంబాలపై ఉన్న ఆర్థిక భారం తగ్గింది.

ఈ పథకం నేపథ్యంలో, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. పేదల ఇంట్లో విద్యుత్ వెలుగులు నింపడమే ప్రజా ప్రభుత్వ సంకల్పమని, గృహజ్యోతి పథకం విజయవంతంగా అమలు కావడం వల్ల ప్రజలు లబ్ధి పొందుతున్నారని ఆయన వెల్లడించారు. హైదరాబాద్‌లోనే ఈ పథకం ద్వారా 10.52 లక్షల కుటుంబాలు లబ్ధి పొందినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమం ప్రజాసంక్షేమానికి మైలురాయి అని ఆయన అభిప్రాయపడ్డారు. ఇందిరమ్మ పాలన సంక్షేమానికి ఒక చిరునామాగా నిలుస్తోందని ముఖ్యమంత్రి వివరించారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *