ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తొలిసారిగా విశాఖ రుషికొండ ప్యాలెస్ సముదాయంలో పర్యటించారు. గత ప్రభుత్వ హయాంలో ఇక్కడ నిర్మించిన భవనాలను చంద్రబాబు నాయుడు నేడు పరిశీలించారు. ఈ మధ్యాహ్నం అనకాపల్లి జిల్లా వెన్నెలపాలెంలో రోడ్డుపై గుంతలు పూడ్చే కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు నాయుడు అనంతరం విశాఖలోని రుషికొండ చేరుకున్నారు.
ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు వెంట టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కూడా ఉన్నారు. రుషికొండ ప్యాలెస్ వివరాలను గంటా సీఎం చంద్రబాబు నాయుడుకు వివరించారు. చంద్రబాబు నాయుడు అధికారులను అడిగి మరికొన్ని వివరాలు తెలుసుకున్నారు. పలు భవనాల లోపలికి కూడా వెళ్లిన చంద్రబాబు నాయుడు అక్కడి విలాసవంతమైన సౌకర్యాలను పరిశీలించారు.