తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర పెట్టుబడుల కొరకు విదేశాల్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. విదేశీ పర్యటన నేటితో ముగియనుంది. రేపు రేవంత్ రెడ్డి హైదరాబాద్ కు చేరుకుంటారు. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు సాధించే లక్ష్యంతో ఆయన పది రోజులకు పైగానే విదేశీ పర్యటనలో ఉన్నారు. తొలుత అమెరికాలో పర్యటించిన రేవంత్ రెడ్డి బృందం అనేక పెట్టుబడులు సాధించింది. అవగాహన ఒప్పందాలను కుదుర్చుకుంది.

ఎక్కువ రోజులు అమెరికాలో పర్యటించిన రేవంత్ రెడ్డి తర్వాత చివరి రెండు రోజులు దక్షిణ కొరియాలో పర్యటించారు. శనివారం నాడు అమెరికా పర్యటన ముగించుకొని కొరియాకు వెళ్లారు. అయితే గత కొన్ని రోజులుగా సీఎం విదేశీ పర్యటనలో బిజీబిజీగా గడుపుతున్నారు. ఈ పర్యటనలో సీఎం తో పాటు ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు, ఖైరతాబాద్ డీసీసీ ప్రెసిడెంట్ రోహిణ్ రెడ్డి తదితరులు సౌత్ కొరియాలో పర్యటిస్తున్నారు. వరంగల్ లోని కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్ లో కొరియా నుంచి పెట్టుబడులను సాధించగలిగారు. దీంతో కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్కులో పెట్టుబడులు పెట్టేందుకు తాము సిద్ధమని కొరియా ఫెడరేషన్‌ ఆఫ్‌ టెక్స్‌టైల్‌ ఇండస్ట్రీ ప్రతినిధులు తెలిపారు. వివిధ సంస్థల ప్రతినిధులతో ఆయన చర్చలు జరిపారు. రేపు రేవంత్ రెడ్డి బృందం హైదరాబాద్ చేరుకోనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *