తాము ఏ కార్యక్రమం చేసినా పని పెట్టుకుని బురద జల్లుతున్నారని మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వెనుకబడిన కులాలు అంటే కేసీఆర్, హరీష్ లకు చిన్నచూపు అని అన్నారు. బడుగు బలహీన వర్గాలకు చెందిన మహేష్ గౌడ్ పీసీసీ అధ్యక్షుడయ్యారని, దళితుడైన భట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం అయ్యారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని నిలబెట్టుకునే పార్టీ అని అన్నారు. ఫామ్ హౌస్‌లో లిక్కర్, డ్రగ్స్‌తో అడ్డంగా దొరికి పోయి దీపావళి పండుగ దావత్ చేస్తే తప్పేంది అంటున్నారని మంత్రి విమర్శించారు.

హరీష్‌ రావు రుణమాఫీ చేయలేదని అంటున్నాడని, రూ 18 వేల కోట్లతో లక్షల మంది రైతులకు రుణమాఫీ చేశామని మంత్రి తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక దేశంలో మొదటి సారి బీసీ కులగణన ఏర్పాటుకు కేబినెట్ తీర్మానం చేశామన్నారు. వెనుకబడిన కులాల మీద వాళ్లకు ప్రేమ లేదన్నారు. పార్టీలకు అతీతంగా అందరూ పాల్గొనాలన్నారు. కేసీఆర్ ఫాంహౌస్ నుంచి బీసీ కులగణనపై ప్రెస్ నోట్ అయినా విడుదల చేయాలన్నారు. లేదంటే మీ పార్టీ కనుమరుగు అవుతుందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *