ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మరికాసేపట్లో సమావేశం కానున్నారు. ఇవాళ ఢిల్లీ పర్యటనకు వెళ్తున్న చంద్రబాబు ఇప్పటికే హైదరాబాద్‌లోని తన జూబ్లీహిల్స్ నివాసానికి చేరుకున్నారు. దీంతో ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డి, మాధవరం కృష్ణారావు, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి ఆయనతో భేటీ కానున్నారు.
చంద్రబాబును కలిసి మల్లారెడ్డి మనవరాలు శ్రేయరెడ్డి పెళ్లికి ఆహ్వానించనున్నారు. గతంలో మల్లారెడ్డి, మాధవరం కృష్ణారావు, తీగల కృష్ణారెడ్డి టీడీపీలో పనిచేసిన విషయం తెలిసిందే. కానీ, ఆ తర్వాత టీడీపీకి గుడ్‌బై చెప్పారు. మల్లారెడ్డి మనవరాలు పెళ్లి కారణంగా చాలా కాలం తర్వాత మళ్లీ టీడీపీ అధినేతను కలవబోతున్నారు.