ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చావును కోరుకున్నారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం ప్రసంగాన్ని బహిష్కరించారు. అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. అనంతరం హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ, కేసీఆర్‌ను మార్చురీకి పంపిస్తామని రేవంత్ అన్నారని, అందుకే ఆయన ప్రసంగాన్ని బహిష్కరించామని అన్నారు. తెలంగాణ కోసం ప్రాణాలను పణంగా పెట్టిన కేసీఆర్ చావును కోరుకోవడం దారుణమని ఆయన అన్నారు.
అసెంబ్లీలో మంత్రి ఉత్తమ్ అన్నీ అబద్ధాలే చెప్పారని హరీశ్ విమర్శించారు. కాంగ్రెస్ వల్ల కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని అన్నారు. ఇటీవల ఏపీ సీఎం చంద్రబాబును ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులు కలిశారని, ఆయనతో కలసి భోజనం చేసి వచ్చారని చెప్పారు.